Pradeep enters into Big Boss 2 – Telugu

తెలుగు జనాలలో ప్రదీప్ కి ఉన్న స్థానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రదీప్ ఏ షో చేసినా అది హిట్ అవ్వాల్సిందే. ఈ మధ్య బిగ్ బాస్ షోలో కి ప్రదీప్ వచ్చారు అనే ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మరి ఇంత బిజీగా ఉన్న ప్రదీప్ బిగ్ బాస్ లోనికి రావడంతో తన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.

అన్ని షోలు చేస్తున్న ప్రదీప్ ఇక్కడే ఉండిపోతారా లేక ఏంటి అనేది ఎవరికీ అర్ధం కాలేదు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలోనే ఢీ 10 షూటింగ్ అయిపోవడం తో బిగ్ బాస్ లోనికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా చూస్తే అర్ధం అయింది ఏంటి అంటే తను కేవలం గెస్టులా వచ్చారు అని. మంచి రేటింగ్ ఉన్న బిగ్ బాస్ కి ఇంకొంచెం రేటింగ్ పెంచడానికి అని అర్ధం చేసుకొవచ్చు.